దున్నరాజుల విన్యాసాలు వీక్షకుల హర్షధ్వానాల మధ్య నేటి నుంచి మహానగరంలో సదర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత రెండో రోజు సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే నిన్న గ్రహణం వుండటంతో.. సదర్ ఉద్సవాలను నేడు, రేపు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు.
రంగారెడ్డి జిల్లాలో నార్సింగీ సదర్ ఉత్సవాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్సింగీ మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆశోక్ యాదవ్ మధ్య వివాదం ఉద్రికత్తతకు దారితీసింది.
దీపావళి పండుగ తర్వాత సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్దమతోంది. డప్పు చప్పుళ్లు, యువత నృత్యాల నడుమ అందగా ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు స్పెషల్ అట్రక్షన్‌గా నిలవనున్నాయి. ఈ పండుగ యాదవులు ఘనంగా జరుపుకుంటారు.
సదర్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేళ ఓ దున్నపోతు వీరంగం చేసింది. ఖైరతాబాద్ చౌరస్తా లో దున్నపోతు గంట సేపు హల్ చల్ చేసింది. సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా తాడు తెంపుకొని పరుగు తీసింది ఓ దున్నపోతు. రోడ్డుపై వున్న స్కూటీనీ కొంత దూరం లాక్కెళ్లి పోయింది దున్నపోతు. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎట్టకేలకు దున్నపోతును బంధించారు యాదవులు. ఏటా దీపావళి అనంతరం హైదరాబాద్ లో సదరు ఉత్సవం నిర్వహించడం…