NTV Telugu Site icon

BRS Party: నిన్న దానం.. నేడు కడియం.. అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌

Kadiyam Srihari Brs

Kadiyam Srihari Brs

BRS Party: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. వెంటనే కాంగ్రెస్ గేట్లు తెరిచింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో మెజారిటీ నేతలు కాంగ్రెస్‌లో ఎదిగిన వారే కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా పెద్దదే. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్న కె.కేశవరావు మళ్లీ మాతృపార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Read also: Pana Devi : మూడు స్వర్ణాలు సాధించిన 92ఏళ్ల వృద్ధురాలు.. ఈ సారి స్వీడన్‌లో సత్తా చాటనుంది

ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇదే బాటలో కడియం శ్రీహరి ఉన్నారు. నేడో, రేపో కడియం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్ననని కూడా ఆయన ప్రకటించారు. అయితే కడియం పార్టీ మార్పుపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్దమైంది. ఈనేపథ్యంలో అసెంబ్లీ కి ఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ చేరుకున్నారు. అయితే.. స్పీకర్ అందుబాటులో లేరని అసెంబ్లీ సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సెక్రటరీని కలిసే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు.

Read also: Kadiyam Srihari: అనుచరులతో కడియం భేటీ.. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

అయితే తాజాగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరిన విషయం తెలిసిందే. అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, బండారు ల‌క్ష్మారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానం పై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదని తెలిపారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడని గుర్తు చేశారు. అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా? అని ప్రశ్నిస్తారు.
Om Bheem Bush OTT: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఓం భీమ్ బుష్’.. ఆరోజే రిలీజ్..!?