BRS Party: నిన్న దానం.. నేడు కడియం.. అనర్హత వేటుపై బీఆర్ఎస్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Party: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వెంటనే కాంగ్రెస్ గేట్లు తెరిచింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీల్లో మెజారిటీ నేతలు కాంగ్రెస్‌లో ఎదిగిన వారే కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా పెద్దదే. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్న కె.కేశవరావు మళ్లీ మాతృపార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Read also: Pana Devi : మూడు స్వర్ణాలు సాధించిన 92ఏళ్ల వృద్ధురాలు.. ఈ సారి స్వీడన్లో సత్తా చాటనుంది
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇదే బాటలో కడియం శ్రీహరి ఉన్నారు. నేడో, రేపో కడియం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్ననని కూడా ఆయన ప్రకటించారు. అయితే కడియం పార్టీ మార్పుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమైంది. ఈనేపథ్యంలో అసెంబ్లీ కి ఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ చేరుకున్నారు. అయితే.. స్పీకర్ అందుబాటులో లేరని అసెంబ్లీ సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సెక్రటరీని కలిసే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు.
Read also: Kadiyam Srihari: అనుచరులతో కడియం భేటీ.. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అయితే తాజాగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరిన విషయం తెలిసిందే. అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానం పై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదని తెలిపారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడని గుర్తు చేశారు. అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా? అని ప్రశ్నిస్తారు.
Om Bheem Bush OTT: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఓం భీమ్ బుష్’.. ఆరోజే రిలీజ్..!?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!