Site icon NTV Telugu

Telangana Politics: తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ హాట్‌ హాట్‌ భేటీలు

Brs, Bjp, Congress

Brs, Bjp, Congress

Telangana Politics: తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, టి.కాంగ్రెస్‌ వరుస కార్యక్రమాలతో హాట్‌ హాట్‌ గా సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ భారీ సభకు ప్లాన్‌ చేస్తుంటే.. కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన ఢిల్లీ దూతలు హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయ్యారు. రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి వరుస భేటీలతో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కొత్త ఇంఛార్జీ మాణిక్‌ రావు థాక్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. నగరంలో అడుపెట్టడమే ఆలస్యం గాంధీ భవన్‌కు వెళ్లారు. కాంగ్రెస్‌ నేతల మధ్య వున్నగ్యాప్‌లను పోగొట్టేందుకు వరుస మీటింగ్‌ లు ఏర్పాటుచేశారు. ఇటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సైతం రెండు రోజుల తెలంగాణాలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కమలం పార్టీ 10వేల కార్నర్‌ మీటింగ్‌ లు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ మీటింగ్‌ లపై సమీక్షిస్తున్నారు సునీల్‌ బన్సల్‌. ఇందులో భాగంగా మల్కా్జ్‌ గిరి పార్లమెంట్‌ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. మధ్యాహ్నం పార్లమెంట్‌ ఇన్‌చార్జీలు, కన్వీనర్లు, విస్తారకులతో సమావేశం కానున్నారు.

Read also: Chinta Mohan: వచ్చే ఎన్నికల్లో కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయం

ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ

అయితే.. ఈ నెల 18న ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్‌ తలపెట్టిన భారీ బహిరంగసభకు జన ప్రభంజనం కోసం జిల్లా గులాబీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ..సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టగా.. మరోవైపు పోలీ సు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనవరి 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈసభకు.. మరో మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ హాజరుకానున్నారు.

Read also:RRR: ‘నాటు నాటు…’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ పై చిరు ఏమన్నారంటే…

మాణిక్‌ రావు థాక్రే వరుస భేటీలు

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కొత్త ఇంఛార్జీ మాణిక్‌ రావు థాక్రే వరుస భేటీలు. రెండురోజుల పాటు రాష్ట్రంలో ఉండి పరిస్థితులను చక్కదిద్దనున్నారు థాక్రే. అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఉదయం 10.30 నుంచి వరసగా సమావేశాలు నిర్వహించనున్నారు. మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగత భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశం ఉంటుంది. రేపు డీసీసీ లు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య నెలకొన్న ‘టగ్ ఆఫ్ వార్’ను ఆయన ఎలా పరిష్కరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రాజీనామా లేఖలతో నివ్వెరపోయిన సీనియర్లను ఎలా బుజ్జగిస్తారో చూడాలి. మాణిక్కం ఠాకూర్‌తో అవలీలగా సమస్యను పరిష్కరించగలరన్న నమ్మకంతో పార్టీ నాయకత్వం ఆయనను పంపిన విషయం తెలిసిందే.

Read also: RRR: ‘నాటు నాటు…’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ పై చిరు ఏమన్నారంటే…

సునీల్‌ బన్సల్‌ రెండు రోజులు పర్యన

ఇక తెలంగాణలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ రెండు రోజులు పర్యటించనున్నారు. కాగా.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​గా సునీల్ బన్సల్​ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. నేడుఉదయం 10 గంటలకు కూకట్ పల్లిలో జరగనున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో పాల్గొనున్నారు. మధ్యహ్నo 3 గంటలకు బండి‌ సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్, సహ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్ లతో బన్సల్ కీలక భేటీ కానున్నారు. 12న రేపు ఉదయం పటాన్‌చెరులో జరగనున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం.. మధ్యాహ్నం జరగనున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలకు సునీల్ బన్సల్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. బీజేపీ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Veera Simha Reddy: మరి కొన్ని గంటల్లో గాడ్ మాసెస్ ఆగమనం…

Exit mobile version