Site icon NTV Telugu

High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ

High Court

High Court

High Court: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కుక్కల దాడి ఘటనపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందడాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. పత్రికల్లో, మీడియా లో వచ్చిన ప్రసారాల ఆధారంగా సుమోటోగా విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ అంబర్‌ పేట డిప్యూటీ కమిషనర్‌, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. వీధికుక్కలు చిన్నారులపై దాడులు జరుగుతున్న ఎందుకు వదిలేసారని? ఇలా పిల్లలు కుక్కలకు బలి కావాల్సిందేనా? అనే తీరుపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే నేడు హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకింది.

Read also: Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి

నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం హాలిడే కావడంతో గంగాధర్‌ పిల్లలిద్దర్నీ తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు తీసుకువచ్చాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్‌, తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. రెండు కుక్కలు చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వాటిని వెళ్లగొట్టడంతో బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Medico Preethi Father: ఇష్యూని డైవర్ట్ చేయడానికే నిమ్స్ కి తీసుకొచ్చారు

Exit mobile version