Site icon NTV Telugu

Rat attack on boy: రెస్టారెంట్‌లో బాలుడిపై ఎలుక దాడి.. కుటుంబసభ్యులు ఏం చేశారంటే..

Rat Atak

Rat Atak

Rat attack on boy: హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద కొనసాగుతుండగా.. తాజాగా ఎలుకలు కూడా రంగంలోకి దిగాయి. ఓ హోటల్‌లో ఓ బాలుడిపై ఎలుక దాడి చేసింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. కుటుంబం మెక్‌డొనాల్డ్స్ బర్గర్ అండ్ ఫ్రైస్‌కి వెళ్ళింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుకానీ ఎలుక బాలుడిపై దాడి చేసింది. తమ బిడ్డకు హోటల్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. సదరు ఫుడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Read also: Air Force Helicopter: తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆర్మీ మేజర్‌గా పనిచేస్తున్న సావియో హెర్కీస్ కుటుంబసభ్యులతో కలిసి పేట్ బషీరాబాద్ హైటెన్షన్ లైన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లాడు. వాళ్ళు కోరుకున్న ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ తండ్రిపక్కనే కుమారున్ని కూర్చోబెట్టుకుని ఆహ్లోదంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలోనే ఓ ఎలుక రెస్టారెంట్ లో హఠాత్తుగా వచ్చింది. తండ్రి పక్కనే కూర్చన్న బాలుడి పై ఎక్కింది. ఆ బాలుడు అరుస్తు పైకి లేయడంతో ఆ ఎలుక అయినా వదలలేదు. బాలుడి తొడపై ఎక్కి కొరికింది. దీంతో ఆబాలుడు కేకలు వేస్తూ కూర్చన్న చోటునుంచి లేచి బయటకు వచ్చాడు. దీంతో బాలుడి తొడపై గాయమైంది. ఈ విషయంపై మెక్‌డొనాల్డ్‌ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితురాలు శనివారం పేట్ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version