NTV Telugu Site icon

Boora Narsaiah Goud: ఒక రైతు బందు పెట్టి.. పది పథకాలు రద్దు చేశారు

Boora Narsaiah On Brs

Boora Narsaiah On Brs

Boora Narsaiah Goud Fires On Telangana Govt Over Rythu Bandhu: బీజేపీ నేత బూర నర్సయ్య తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఒక రైతు బందు పథకం పెట్టి, పది పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. ఇది రైతు బందు కాదు, భూమి బందు అని ఎద్దేవా చేశారు. కేంద్రం అందిస్తోన్న రైతు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందనీయడం లేదని, రైతు రుణమాఫీ కూడా చేయడం లేదని ఆరోపణలు చేశారు. ఆయిల్ ఫార్మ్‌కు కేంద్రం సబ్సిడీ ఇస్తోందని, ఈ విషయాన్ని రైతులకు ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. 2014 భారతదేశం అప్పు కేవలం రెండింతలు మాత్రమే పెరిగితే.. తెలంగాణ అప్పు ఆరు రెట్లు పెరిగిందన్నారు. మూడు చెక్ డ్యాంలు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మోడీ ‘గతి శక్తి’ని నమ్ముకుంటే.. కేసీఆర్ ఉచిత శక్తిని వాడుకున్నారని విమర్శించారు. ఎంబీబీఎస్ సీట్ల ఫీజు తగ్గడానికి, ఎక్కువ రాంక్ వచ్చిన వారికి సీట్లు రావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కోటి ఓట్లు.. 90 సీట్లు.. ప్రగతి భవన్‌లో స్లాట్.. ఇప్పుడిదే బీజేపీ నినాదమని తెలిపారు.

Asaduddin Owaisi: 2024లో నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

ఇంతకుముందు కూడా.. ఉపాధిహామీ పథకం తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారిందని బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం ‘రైతు వ్యతిరేక’మని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ అని పేరు పెట్టడమేంటని నిలదీశారు. తెలంగాణ తల్లి పేరు మీద న్యూట్రీషియన్ కిట్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో కేవలం ఒక కుటుంబం కోసమే రాజకీయ వెట్టి చాకిరి ఉంటుందని.. కేసీఆర్ ఆడిక్షన్ నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులు పొందే అవకాశం కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. బీజేపీలో వ్యక్తి కాదని.. పార్టీయే ముఖ్యమని బూర నర్సయ్య పేర్కొన్నారు.

Akkineni Nagarjuna: నాగార్జునతో పూజాహెగ్డే వ్యాపారం