Boora Narsaiah Goud Again Fires on CM KCR: మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు అడ్డుపడుతూ.. కేసీఆర్ హైందవుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చిన గిరి వికాష్ నిధులను 30 శాతం కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణ, గోదారి నదులు మహారాష్ట్ర నుంచి మొదలవుతాయని.. ఆ నదుల విషయంలో మహారాష్ట్ర అడ్డుపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు బ్రతుకుతాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అయినట్టు, అది కేసీఆర్ రాష్ట్రం అన్నట్టు బీఆర్ఎస్ నేతలు భ్రమలో ఉన్నారని.. ఆ భ్రమలో నుంచి వాళ్లు బయటకు రావాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం మన భాతరదేశంలో భాగమేనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ అనేక రకాలుగా అబివృద్ధి చెందేదని వెల్లడించారు.
Bajrang Dal: భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ నేతలు అబద్ధం చెప్తున్నారని ఆరోపించిన బూరనర్సయ్య గౌడ్.. నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రమైతే మరి ఎందుకు జీఎస్టీ కలెక్షన్ లేదని నిలదీశారు. మహారాష్ట్రలో 33 వేల 196 కోట్లు, కర్ణాటకలో 4 వేల 593 కోట్లు, గుజరాత్‌లో 11 వేల 7 వందల 21 కోట్లు, హర్యానాలో 10 వేల 35 కోట్లు, జార్ఖండ్‌లో 3700 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్ వస్తోందని వివరించారు. కానీ.. తెలంగాణలో మాత్రం 5600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణలో మాత్రమే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. లిక్కర్ దందా కూడా ఎక్కువగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తోందని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు తొలగించి.. ‘కేసీఆర్ సచివాలయం’ అనే పేరు పెట్టుకోవాలంటూ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు.
Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్