Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఒక్కరోజే సమావేశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు, బట్టి గారు ముందే ప్రకటించారని, ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నమని ఆయన అన్నారు.

Jimmy Gaminlune Mate: సహాయక చర్యల్లో ప్రాణాలు వదలిన అగ్నివీరుడు..

వరదల కారణంగా వేల ఎకరాల పంటలు నాశనం అయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కానీ ఆ అంశంపై కూడా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టమైందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, ముఖ్యమంత్రి దానిపై సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగుల సమస్య, రైతులు మరియు మహిళలకు ఇచ్చిన హామీలు, మాజీ సర్పంచుల బకాయిలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రెవెన్యూ, విద్యుత్, వైద్య రంగ సమస్యలపై చర్చ జరగాలని బీజేపీ ప్రతిపాదించినా ప్రభుత్వం దానికి సంధానం లేకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు.

కనీసం 30 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ కోరిందని, కానీ ప్రభుత్వం ఒక్కరోజు సమావేశంతోనే సభను ‘బుల్డోజ్’ చేయాలని చూస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అత్యంత కీలకమైన సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమకవసరమైన విషయాలనే ఎంచుకుని చర్చ పెడుతున్నారని విమర్శించారు. “కనీసం ఎన్ని రోజులు అసెంబ్లీ నడుస్తుందో కూడా స్పష్టంగా చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్యలపై చర్చకు రాకుండా గొంతు నొక్కేస్తోంది. రేపు మాత్రం బీజేపీ తరఫున ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావిస్తాం” అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Asia Cup 2025: అభిమానులకు కీలక అప్‌డేట్‌.. ఆసియా కప్‌ షెడ్యూల్‌లో మార్పు!

Exit mobile version