పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 8న బీజేపీ నిరసనలు చేపడుతందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని పన్నులు తగ్గించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. ఎప్పుడు కేంద్రంపైనా నిందలు వేయడమే తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదన్నారు. హుజురాబాద్ ఎన్నికతో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని బండి సంజయ్ అన్నారు.
