Site icon NTV Telugu

Bandi Sanjay: మోడీని అంబేద్కర్‌ వారసుడితో పోల్చిన బండి

Bandi Sanjay

Bandi Sanjay

మోడీ నిర్ణ‌యాల‌తో బాబా సాహెబ్ అంబేద్క‌ర్ తృప్తి చెందుతార‌ని రాష్ట్ర అద్య‌క్షుడు అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా.. ప్ర‌ధాని మోదీ, బీజేపీ అద్య‌క్షుడు జేపీ న‌డ్డాకు బండి సంజ‌య్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆదివాసీల‌కు అవ‌కాశం ఇచ్చినందుకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ద్రౌప‌తి ముర్ము త‌ల్లిగా దేశ సేవ చేస్తార‌ని ఆకాంక్షించారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గానికి చెందిన కలాంను, ఎస్సీ వర్గానికి చెంది కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని బండి సంజ‌య్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. ప్రధాని మోడీని అంబేద్కర్‌ వారసుడితో బండి‌ సంజయ్ పోల్చడంతో చ‌ర్చ‌నీయాంశ‌కంగా మారింది.

అయితే నేడు ఎన్డీఏ కూటమి తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషనన్ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామపత్రాలను ఆమె దాఖలు చేశారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తెలుగు రాష్ట్రాల నుంచి వైపీసీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Rakul Preet Singh : ఊపేస్తున్న రకుల్ డ్యాన్స్ వీడియో!

Exit mobile version