Asaduddin Owaisi: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని పెళ్లి పెద్దగా, ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్‌పై అసదుద్దీన్ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు.
Read Also: BJP: ఎంపీలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. రూ.100కు 100 యూనిట్ల విద్యుత్ హమీ..
ప్రధాని నరేంద్రమోడీ ఫోటో బీజేపీకి పనికిరాదని, అందుకే నా ఫోటో పెట్టారని ఓవైసీ అన్నారు. ఈ వయసులో పెళ్లికార్డులో నా ఫోటోల ఉంది, పెళ్లికాని వ్యక్తి ఫోటో పెట్టాల్సి ఉందని బీజేపీకి చురకలంటించారు. తెలంగాణలో ప్రధాని మోడీ ప్రభావం చూపకపవోడంతో బీజేపీ తన ఫోటుల వాడుకుంటుందని ఎద్దేవా చేశారు. ‘‘ఒక కార్టూన్‌లో, నేను కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాహాన్ని నిర్వహిస్తున్నట్లు ఖాజీగా చూపించారు. తెలంగాణలో ప్రధాని మోడీ ఫోటో తమకు పనికి రాదని ఇప్పడు అర్థమైంది. అసదుద్దీన్ ఫోటో పెడితే వారికి లాభమని ఆలోచిస్తున్నారు. మీ మోడీ ఫోటో ఎలాంటి ప్రభావం చూపడం లేదు, కాబట్టి ఇలానే కానివ్వండి’’ అంటూ ఓ బహిరంగ సభలో బీజేపీపై కామెంట్స్ చేశారు. నేను ఖాజీ అయితే, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని ఓవైసీ అన్నారు.
తన వెంట పడకుండా పెళ్లిళ్లు చేసుకోలేని స్తోమత లేని పేదలకు సాయం చేయాలని బీజేపీకి సూచించారు. అంతకుముందు బీజేపీ ఈ పోస్టర్లలో ‘‘ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్, కాంగ్రెస్ నిఖానామాకు ఆహ్వానిస్తున్నారు, ఇది ప్రైవేటు వ్యవహారం కాదు’’ అంటూ పోస్టర్ వార్‌కి తెరతీసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే అని విమర్శలు గుప్పిస్తోంది. నవంబర్ 30న తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది.