NTV Telugu Site icon

JP Nadda : ఈ నెల 5న మహబూబ్‌నగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రం రెండో దశ ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్రలో పాల్గొనడానికి బీజేప జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 5న మహాబూబ్‌నగర్‌కు రానున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ప్రజా సంగ్రామయాత్ర సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జన సమీకరణ పై బీజేపీ దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు.

బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కనీవినీ ఎరగని రీతిలో జేపీ నడ్డా సభను సక్సెస్ చేద్దామని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా అని.. బీజేపీ కార్యకర్తల సత్తా చూపండి అని ఆయన పిలుపునిచ్చారు. మండలాలు, గ్రామాలు, బూత్ ల వారీగా జన సమీకరణ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు.

Show comments