NTV Telugu Site icon

JP Nadda : నేడు మహబూబ్‌నగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన రెండో దశ ప్రజాసంగ్రామ యాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. అయితే.. ఈ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బండమీదిపల్లి, వన్ టౌన్ మీదుగా జిల్లా కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. బండి సంజయ్‌.. 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. అయితే నేడు జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు.

అంతేకాకుండా బీజేపీ ఆఫీస్ బేరర్స్ తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సమీకరణ పై బీజేపీ దృష్టి పెట్టింది. సభను విజయవంతం చేసి టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసరాలనే త్రిముఖ వ్యూహంతో పాదయాత్ర సాగుతోంది. అయితే.. ఇప్పటికే.. పాదయాత్రలో బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీకి అవకాశం ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చిచూడండి.. అంటూ ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.