BJP MP K.Laxman: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా వికసిత్ పత్రాన్ని మోడీ గ్యారెంటీ గా ప్రజల ముందు ఉంచామన్నారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ విచ్ఛిన్న రాజకీయాలతో విభజించు భారత్ విధానాలతో వ్యవహరిస్తోందన్నారు. వికసిత్ భారత్, విభజించు భారత్ మధ్యనే ఎన్నికలుంటాయన్నారు. కూటమికి ఓటమి తప్పదని తెలిపోయాక విభజించు భారత్ విధానాన్ని తెర మీదకు తెచ్చారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానరిచి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. అంబేద్కర్ ను గౌరవించి భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీది తెలిపారు. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందన్నారు.
Read also: BRS KTR: బీఆర్ఎస్ లోనే గౌరవం ఉందన్న ఈటల మాటను గుర్తుపెట్టుకోండి..
ముస్లిం సంత్రుస్తీకరమైన విధానాలతో కాంగ్రెస్ హిందూ సమాజంపై విషం జిమ్ముతున్నారని తెలిపారు. కాంగ్రెస్ సనాతన ధర్మం వినాశనం కోరుకునే పార్టీ అన్నారు. CAA పట్ల కాంగ్రెస్ కూటమి తప్పుడు విష ప్రచారం చేస్తోందన్నారు. పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిప్పులు పోసుకుంటుందని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. అధికారంలోకి వస్తె 370 నీ మళ్ళీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కుల పరమైన రిజర్వేషన్లతో చిచ్చు పెడుతోందన్నారు. బీసీ (ఈ) లోకి ముస్లిoలను తెచ్చి అదనంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిoచడం బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు.
Read also: KCR: సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్..
రంగనాథ న్ కమిషన్ 2004 లో ఏర్పాటు చేశారన్నారు. రంగనాథన్ సిఫార్సులను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్, మండల కమిటీలను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు చరిత్ర తెలుసుకోవాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టంగా చెబుతున్నామన్నారు. వారసత్వ సంపద పిల్లలకు చెందాలంటే యాభై శాతం సంపద ప్రభుత్వానికి చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్యాం పిట్రోడ్ చెబుతున్నారని అన్నారు. ఇదెక్కడి న్యాయం.. ఆ యాభై శాతం సంపద ఎవరికి పంచుతారు? అని ప్రశ్నించారు. వారసత్వ సంపదను లాక్కొని ఒక వర్గానికి పంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. మత పరమైన రిజర్వేషన్ రద్దు చేస్తాం తప్ప ఇంకెలాంటి రిజర్వేషన్లను రద్దు చేయమని స్పష్టం చేశారు.
Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
