Site icon NTV Telugu

Raghunandan Rao: బీఏసీ సమావేశాలకు ఒక్కరున్నప్పుడు పిలిచారు.. ఇప్పుడు ముగ్గురున్నా పిలువరా?

Cm, Raghunandanrao

Cm, Raghunandanrao

ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. అయితే.. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్ రావు ఎద్దేవ చేశారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా.. గతంలో కూడా ఇదే విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివరించామని.. అయినా తమని బీఏసీ సమావేశానికి పిలవలేదని తెలిపారు. ఇక సీఎం చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని రఘునందన్‌ రావు ఆరోపించారు.

బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజానీకం 2 వ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని అన్నారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు 2- 3 రోజులకే పరిమితం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పోయినసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడం పై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారని అన్నారు. చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మాకు వినతులు వస్తున్నాయని ఈటెల తెలిపారు.
Dengue Danger Bells: ఏజెన్సీపై డెంగీ పడగ.. ఆస్పత్రుల్లో బెడ్ లు నిల్

Exit mobile version