తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్-చైనా సరిహద్దుల్లో జరుగుతోన్న పరిణామాలపై చేసిన వ్యాఖ్యలును తప్పుబడుతోంది భారతీయ జనతా పార్టీ.. కేసీఆర్‌పై దేశద్రోహి కింద కేసు నమోదు చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్‌లో హిమాచల్‌ప్రదేశ్ లో తోకముడిచిన సైన్యం అని మాట్లాడారని.. దీంతో.. కేసీఆర్‌ను దేశద్రోహి కింద కేసు చేయొచ్చు అని తెలిపారు.. ఇక, బీజేపీ మతద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. 2014 నుండి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు జరగలేదు, చొరబాట్లు జరగలేదు అని రఘునందన్ రావు వెల్లడించారు.
కేసీఆర్‌పై దేశద్రోహి కింద కేసు చేయొచ్చు..!
