Maheshwar Reddy: ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్లు వుందని మండిపడ్డారు. మ్యానిఫెస్టోకు చట్టబద్ధత ఉండాలన్నారు. కాంగ్రెస్ మొత్తం 412 హామీలు ఇచ్చారని తెలిపారు. ఈ సెషన్ లోనే కాంగ్రెస్ హామీలకు చట్టబద్ధత తీసుకు రావాలన్నారు. ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి రోజు దర్బార్ నడిపిస్తామని చెప్పి…ఇప్పుడు వారానికి రెండు రోజులు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తామని అన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చారని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో వుంచుకుని హామీలను విస్మరిస్తే పోరాటం చేస్తామన్నారు. అనేక హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్తానంలో ఓడిపోయారని తెలిపారు. సీఎంకు పాలనా అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్ళాలని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు.
Read also: Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. బీజేపీ పక్షాన నూతన రాష్ట్ర ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం వుందన్నారు. అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్లుగా కనపడుతుందని తెలిపారు. బడ్జెట్ కు భారంగా కాంగ్రెస్ పార్టీ హామీలు వున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తుందో చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్రను విస్మరించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యసభలో బీజేపీ సంపూర్ణ మద్ధతు తెలిపిందని, సకలజనులతోనే తెలంగాణ ఏర్పాటు అయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక్కటి అవుతామని బిఆర్ఎస్ పార్టీ అంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదన్నారు.
Revanth Reddy: గత చరిత్ర పై చర్చ చేద్దామా..? కేటీఆర్ పై రేవంత్ ఫైర్