Site icon NTV Telugu

Etela Rajender: కష్టం, శ్రమ మనది.. దోపిడీ కేసీఆర్‌ది..!

Etela Rajender

Etela Rajender

కష్టం, శ్రమ మనది.. కేసీఆర్‌ది దోపిడీ అని అందరూ గ్రహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్‌ గాలికి వదిలేశారన్న ఆయన.. ఇక్కడ సమస్యలను ఫేస్ చేసే దమ్ములేక ఇతర రాష్ట్రాలకు ఏదో వెలగ పెడతాను అని వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వస్తే టూరిస్ట్ లని అన్నారు… తెలంగాణపై నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా? అని ప్రశ్నించారు… ఇప్పుడు ఆ ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్, హర్యానా అంటూ వెళ్లారని మండిపడ్డారు. గత రెండు నెలలుగా ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది.. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వరి ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు.

Read Also: Telangana: విద్యార్థిని సూసైడ్‌ కేసులో కొత్త ట్విస్ట్.. రేప్ చేసి చంపేశారు..!

ఇక, 5 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు ఈటల.. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని కాన్సెప్ట్ కేసీఆర్‌కు లేదన్న ఆయన.. మంత్రులు అంటే రెండు కార్లు ముందు వెనక పెట్టుకొని తిరగడం తప్ప చేసేదేమీ లేదు.. మంత్రుల ప్రకటనలకు విలువ లేదన్నారు. ప్రజలు అధికారం ఇస్తే… మీ తాత జాగీరు లాగా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించిన ఈటల.. గతంలో జాతీయ రాజకీయాల్లో వెలుపెట్టిన ఎన్టీఆర్, చంద్రబాబు పరిస్థితి ఏంటో ప్రజలు చూశారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో వెలుపెట్టిన చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పట్టనుంది అంటూ జోస్యం చెప్పారు.

మంత్రులు కారుకూతలు బందు చేసి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్యే ఈటల.. నరేంద్ర మోడీకి కాదు ప్రధాని చైర్ కు గౌవరం ఇవ్వాలన్న కేసీఆర్‌.. ఇప్పుడు ప్రధానిని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని మండిపడ్డారు. మోడీకి మొఖం చూపించే ధైర్యం లేక.. మొఖం చెళ్లక పారిపోయిండు అని ఎద్దేవా చేశారు. ఇక, కేసీఆర్‌ అనుభవం ముందు కేజ్రీవాల్ అనుభవం ఎంత..? అని ప్రశ్నించారు. నీకు రాష్ట్రం మీద సోయి లేదు… అందుకే ఇక్కడ ఏమీ చేయలేదన్న ఆయన.. కేజ్రీవాల్‌కు కమిట్‌మెంట్‌ ఉంది కాబట్టే విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించారు.. కేసీఆర్‌కు ప్రజల పట్ల కమిట్‌మెంట్‌ లేదు అందుకే ప్రగతి భవన్ చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్నారని మండిపడ్డారు ఈటెల రాజేందర్‌.

Exit mobile version