NTV Telugu Site icon

Etela Rajender: భయంతో పీకేని తెచ్చుకున్నారు.. మీ ఓటమిని ఆపలేమని ఆయనే చెప్పాడట..!

Etela Rajender

Etela Rajender

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి పీకే పర్యటించారు.. అయితే, ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ను తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అయితే, మీ (టీఆర్ఎస్‌ పార్టీ) ఓటమిని ఎవరూ ఆపలేరని పీకేనే చెప్పాడట అని వ్యాఖ్యానించారు. ఇక, రైతులతో చెలగాటం ఆటలాడితే మాడి మసి అయిపోతావ్ అంటూ కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు ఈటల… ఐటీలు, పరిశ్రమలున్న అత్యధిక ప్రజలు నివసించేది గ్రామాల్లోనేనని.. వరి చేయకూడదని హుకుం జారీ చేస్తే రైతాంగం బిక్కు బిక్కు మంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: YS Sharmila: రైతులను బెదిరిస్తున్నారు.. మనం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా..?

మరోవైపు, పౌల్ట్రీ రైతాంగానికి మక్కలు దొరకడం లేదన్నారు ఈటల… సీఎం కేసీఆర్‌కి విజన్‌ లేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని రుణమాఫీ, రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నావా? అని నిలదీశారు.. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తుచేసిన ఆయన.. రైతాంగాన్ని అయోమయంలో పడవేస్తున్నారని మండిపడ్డారు.. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు, పబ్‌ల ద్వారా 37 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని.. వడ్లు కొంటె వచ్చే నష్టం 8 వందల కోట్లు మాత్రమే అన్నారు ఈటల రాజేందర్.. ఇక, తక్షణమే లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలని.. చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ శాస్త్రవేత్తల మీటింగ్ పెట్టి.. ఏ పంటలు వేయాలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆయన.. రాష్ట్రంలో మార్పు రాబోతోంది.. ఏ మార్పు జరిగిన అది కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభమవుతుందంటూ జోస్యం చెప్పారు.