NTV Telugu Site icon

కేసీఆర్ ఇప్ప‌టికైనా నేల మీద న‌డువు.. ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదా..?

BJP MLA Etela rajender

సీఎం కేసీఆర్ ఇప్ప‌టికైనా నేల మీద న‌డ‌వాల‌ని సూచించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.. హుజురాబాద్ ఎన్నికలు.. దళితుల మీద ప్రేమ, వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసిండ్రు అని దుయ్య‌బ‌ట్టారు.. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదు అని మండిప‌డ్డ ఈట‌ల‌.. ఈరోజు దుఃఖం లేనోడు బర్లను కొన్నట్టు దళితులకు బ‌ర్ల‌ను అప్ప‌చెప్పార‌ని విమ‌ర్శించారు. అస‌లు, హుజురాబాద్ ఉప‌ ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదే కాద‌న్న ఆయ‌న‌.. ఈటల రాజేందర్ రాజీనామాతోటే కేసీఆర్ దిగివ‌చ్చార‌ని వ్యాఖ్యానించారు.

Read Also: సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ కుట్ర.. నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారం..

ఇక‌, 2023 వరకు దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పరిస్థితి లేద‌న్నారు ఈట‌ల రాజేద‌ర్.. 10 లక్షల స్కీమ్‌లో దళితులకు పూర్తి స్వేచ్చ ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. దళిత బంధు డబ్బులు ప్రగతి భవన్ నుండి ఇస్తలేవు.. ప్రజల డబ్బులే క‌దా అని నిల‌దీశారు.. మ‌రోవైపు కేసీఆర్‌, ఊరురా బెల్టు షాపులు పెట్టి ఎన్నో కుటుంబాల బతుకులు రోడ్డు మీద పడేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు ఈట‌ల‌.. ఇప్పటి కైనా కేసీఆర్‌ నేల మీద నడువు అని సూచించిన ఆయ‌న‌.. డబల్ బెడ్ రూమ్‌లు నిజమైన పేదలకు ఇవ్వాలి.. కానీ, బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.. ఈటల రాజేందర్ అమాయకుడు కాదు ఉద్యమ బిడ్డ.. కానీ, ఉప ఎన్నిక‌లు అయిన తెల్లవారి నుండి నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కనిపిస్తలేడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఇక‌, సీఎం కేసీఆర్‌పై ప్రజలకు వ్యతిరేకత మొద‌లైంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్.