మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారిపోతున్నాయి.. తొలిరౌండ్ నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి… రెండో రౌండ్, మూడో రౌండ్, నాల్గో రౌండ్‌లో బీజేపీకి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా.. మొత్తంగా మాత్రం నాల్గో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్‌కు 613 ఓట్ల మెజార్టీ లభించింది.. అయితే.. చౌటుప్పల్‌లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… కానీ, రాజగోపాల్ రెడ్డి ఆశలను గల్లంతు చేశారు చౌటుప్పల్ ఓటర్లు.. భారీ మెజార్టీ ఆశించిన బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే ఇదే సమయంలో చౌటుప్పల్ ప్రాంతంలో బాగా పుంజుకుంది టీఆర్ఎస్ పార్టీ..
Read Also: Rajagopal Reddy: నేను అనుకున్న మోజారిటీ రాలేదు..
ఇక, నాల్గో రౌండ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో మేం అనుకున్న మెజార్టీ రాలేదన్నారు.. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయన్నారు.. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చన్న ఆయన… మొత్తంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం తనకు ఉందన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మొత్తంగా బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.. చౌటుప్పల్ మండలంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి నిరాశ తప్పలేదు.. అర్బన్ ప్రాంతంలో 5 వేల మెజార్టీ వస్తుందని లెక్కలేసుకున్న రాజగోపాల్ రెడ్డికి.. షాక్ తగిలినట్టు అయ్యింది.