ఆ భూములు ఎవరూ కొనవద్దు.. ఆగండి-విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు వేసింది అని చెబుతున్నారు విజయశాంతి..
ఆక్రమణకు గురవుతోన్న భూములు అమ్ముతున్నామని ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు విజయశాంతి.. అయితే, రేపటి కోకాపేట, ఖనామెట్ వేలంకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని.. 2015 హై కోర్టు ఆదేశాలతోనే రేపటి వేలానికి అనుమతి వచ్చిందని.. జిల్లాల్లో భూముల వేలానికి కోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు.. పూర్తి వాదనలు విన్న తర్వాత మాత్రమే తీర్పు ఇస్తామని కోర్టు చెప్పిందని.. హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు విజయశాంతి.. కేవలం రేపటి వేలానికి మాత్రమే అనుమతి ఉందని.. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదన్న ఆమె.. పూర్తి తీర్పు వచ్చే దాకా భూములు ఎవరూ కొనవద్దు అని విజ్ఞప్తి చేశారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
-
Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
-
Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Alpha : రీసెంట్ బెస్ట్ ట్రైలర్ కట్ ఇదేనేమో
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!