హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతుగా హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల నేను కలిసి పని చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ హుజురాబాద్ లో అడ్డా వేశారన్నారు. ఒక ఉద్యమ కారుడు ఈటల.. ఆలాంటి వ్యక్తిని ఎందుకు ఓడిస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు విజయశాంతి.
ప్రజలు ఆరు సార్లు ఈటలను ఎమ్మెల్యేగా గెలిపించారు. కనీసం కేసీఆర్ కు బుర్ర ఉందా అని అడుగుతున్నా.మేం పెట్టిన భిక్ష నీ ముఖ్యమంత్రి పదవి అని మరిచి పోకు కేసీఆర్ అన్నారు విజయశాంతి. ఆనాడు టైగర్ నరేంద్ర ను బయటకు పంపించావు. ఒక ఆడ బిడ్డను అని కూడ చూడకుండా నన్ను ఆర్ధ రాత్రి 12గంటలకు సస్పెండ్ చేశావు.ఇరవై ఏళ్ళు పార్టీకి సేవ చేసిన ఈటెలను ఏడు నిమిషాల్లో తీసేసావు. ఈటెల రాజేందర్ కు ఇంత దుస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రజల చేతుల్లో సోషల్ మీడియా ఉంది. వాస్తవాలు ప్రజలకు చేరుతున్నాయి. మూడు నెలల క్రితం దళిత బంధు తీసుకు వచ్చావు.
ఇన్ని రోజులు 10లక్షలు ఇవ్వడానికి అడ్డు ఎవరు వచ్చారు కేసీఆర్ అన్నారు. అబద్ధాలు చెప్పడానికి పుట్టిన వ్యక్తి కేసీఆర్. వేస్ట్ ముఖ్యమంత్రిగా నెంబర్ వన్ స్థానంలో కేసీఆర్ ఉన్నారు. రావణ రాజ్యం పోవాలి, రాముడి రాజ్యం రావాలి. హుజురాబాద్ నుండి కేసీఆర్ పతనం ప్రారంభం కావాలన్నారు. కేసీఆర్ మోసకారి, ఒక 420..తెలంగాణ సర్వ నాశనం అయింది. వెంటిలే షన్ మీద ఉంది. కేసీఆర్ చెంప పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు విజయశాంతి.