తెలంగాణపై బీజేపీ శ్రేణులు దృష్టి సాదించారు. హుజూరాబాద్ కషాయి విజయంతో.. బీజేపీ ఫోకస్ ఎక్కువైంది. నగరంలో బీజేపీ కషాయి జెండా ఎగరవేసేందుకు సిద్దమైంది. జూలై 2వ తేదీన మోదీ , షా తో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు భారీగా బీజేపీ అభిమానులు హాజరవ్వాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. సమయం దగ్గర పడుతుండటంతో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంత మయ్యాయి.
కాగా.. జూలై 2న ప్రధాని మోదీ నగరానికి రానున్న విషయం తెలిసిందే. అయితే భేటీకి సారథ్యం వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెల ఒక రోజు ముందే జూలై 1న ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అయితే.. సమావేశాలు జరిగే నోవాటెల్ వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యవర్గ సమావేశాల్లో ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకుంటారు జేపీ నడ్డా. జులై 2న ఉదయం పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు 3వ తేదీ సాయంత్రం 5 వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. అంతేకాకుండా.. 3న సాయంత్రం పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించన్నారు. కాగా తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలు శనివారం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
కాగా.. వచ్చే నెల 2న హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీకి బస కోసం నోవాటెల్ హోటల్‌తో పాటు, రాజ్‌భవన్‌లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని 2న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కుగానీ, లేదా నేరుగా నోవాటెల్‌కు వెళ్లనున్నారు. ఆయనతోపాటు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులకు నోవాటెల్‌లో భారీ భద్రతల నడుమ బస ఏర్పాట్లు చేయనున్నారు.
Agnipath protest: కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం
