NTV Telugu Site icon

Congress and BRS Alliance: బీఆర్ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ అంగీకారం తెలిపిందట..! మేం ఎప్పుడో చెప్పాం..

Gujjula Premender Reddy

Gujjula Premender Reddy

Congress and BRS Alliance: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన కేసీఆర్‌.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు.. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి కేసీఆర్‌ పనిచేస్తారని ఆది నుంచి ఆరోపిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ.. మరోసారి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పొత్తుపై హాట్‌ కామెంట్లు చేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్‌తో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. ఈ విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం అన్నారు.. అధికారం కోసం వాళ్లిద్దరూ ఒక్కటి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టడం చూస్తుంటే.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్టు ఉందని విమర్శలు గుప్పించారు.

Read Also: Veera Simha Reddy Pre Release Event Live: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్

ఇక, రేపు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు ప్రేమేందర్‌రెడ్డి.. ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా సందేశం ఇస్తారని తెలిపారు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని.. జూబ్లీ హిల్స్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గద్వాల్ లో డీకే అరుణ, ముషీరాబాద్ లో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొంటారని వివరించారు.. మరోవైపు.. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర విముఖతతో ఉన్నారని.. కేసీఆర్‌ కేవలం కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణ ప్రజలు ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ వైపు చూస్తున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.