NTV Telugu Site icon

Etela Rajender: రాజగోపాల్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది

Etala Rajender

Etala Rajender

Etela Rajender: మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కాంగ్రెస్‌ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. వారంతా.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిప్పు కణికలు అటుంటే.. మాకందరికి నవ్వొస్తుందన్నారు. ఇక, 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే స్పీకర్పై అవిశ్వాసం పెట్టినమని గుర్తు చేశారు ఈటెల. 2014లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్నారని, వారందరికి డబ్బులిచ్చే కేసీఆర్ చేర్చుకున్నారా? అని ఈటెల ప్రశ్నించారు.

Read also: Minister KTR Roadshow Live: మంత్రి కేటీఆర్ రోడ్ షో లైవ్

2018లో 90 సీట్లలో గెలిచినా కూడా ప్రతిపక్షాలు ఉండొద్దని, ప్రజల పక్షాన మాట్లాడొద్దు అని, కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోలేదా? ప్రశ్నించారు. అయితే.. 2014తో పాటు 2018లో విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా.. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కనుమరుగు అవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను లేపాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. ఇక.. మునుగోడులో కాంగ్రెస్కు డబ్బులిచ్చి కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అహంకారాన్ని కుటుంబ పాలనను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానాన్ని చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలని ఈటెల కోరారు. ఇక మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని, రాజగోపాల్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని ఓటర్లు గమనించాలని కోరారు. అయితే.. నల్గొండ జిల్లా ఉద్యమాల గడ్డ అని, చైతన్యానికి కొదవ లేని ప్రాంతం మునుగోడు ప్రాంతమన్నారు. ఓటు వేసేప్పుడు మునుగోడు ప్రజలు, రైతులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ఈటెల కోరారు.
KA Paul Campaign: వారం రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యేను నేనే