KA Paul Campaign: వారం రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యేను నేనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Confidence on Munugode By poll: ప్రజాశాంతి పార్టీ అధినేత, మునుగోడులో పోటీచేస్తున్న కేఏ పాల్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీల మధ్య సీరియస్ గా ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తుంటే.. ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కే ఏ పాల్ ప్రచారం మాత్రం ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అంకిరెడ్డి పల్లి చౌరస్తా లో ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకూ నేనే సీఎం అన్న పాల్.. ఇప్పుడు స్వరం మార్చారు.. నేను సీఎం కాదు పీఎం అవుతాను అంటున్నారు.
కులగజ్జి లేని సమాజం కావాలని పాల్ పిలుపునిచ్చారు. వారం రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యే అవుతాను అని కే ఏ పాల్ అన్నారు. ఆయన ఏ ధీమాతో ఈ మాటలు అంటున్నారో తెలీదు గానీ…. ఈయన కాన్ఫిడెంట్ చూసి మిగిలిన పార్టీల కార్యకర్తలు అవాక్కవుతున్నారు. రెండురోజుల క్రితం కారులో వెళుతూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. మునుగోడులో గెలిచేది తానేనని, మునుగోడులో మన తర్వాతే ఎవరైనా అంటున్నారు పాల్.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Read Also: KA Paul: గుర్తుపట్టలేని స్థితిలో పాల్.. అసలేమైంది?
మొదటి స్థానం మనదేనని తర్వాత ఎవరుంటారో తేల్చుకోవాలన్నారు. ఆయన విన్యాసాలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని, ప్రజాశాంతి పార్టీ గెలుపు తథ్యమని పాల్ చెబుతుంటే.. లోలోపల నవ్వుకుంటున్నారు ఓటర్లు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తనకు పోటీయే కాదంటున్నారు. అందరికంటే భిన్నంగా బనియన్ వేసుకుని, తలపై తలపాగా, పంచె కట్టి ఒక రైతులా మారి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నెల 3వ తేదీన ఓటర్లు పాల్ కు ఎన్ని ఓట్లు వేస్తారో చూడాలి. ఈనెల 6వ తేదీన జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్ ఓట్ల లెక్క తేలిపోనుంది. గెలిచినా.. ఓడినా పాల్ కామెడీ మాత్రం మునుగోడు వాసులకు కలకాలం గుర్తుండిపోతుదంటే అతిశయోక్తి కాదు.
Read Also: Funny Video: సీరియల్‌లో ఈ సీన్ చూస్తే.. మీరు నవ్వు ఆపుకోలేరు..!!
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!