Site icon NTV Telugu

Bandi Sanjay: పేదల ప్రాణాల కంటే.. కేసీఆర్ సర్కార్‌కు పేరు ప్రఖ్యాతలే ముఖ్యమా?

Bandi Sanjay

Bandi Sanjay

సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు తీరుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ బాధితులను పరామర్శించకుండా బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్య అని అన్నారు. రాష్ట్రంలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం అన్యాయమన్నారు.

మృతిచెందిన మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎంకు పేదల ఉసురు కచ్చితంగా కొడుతుందని, చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్ళ కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనిషి కాదు, రాక్షసుడు అని వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆపరేషన్లు బెదిరించి చేశారు. చికిత్స పొందుతోన్న మహిళలే స్వయంగా చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు.
Madhya Pradesh: పెళ్లికి ఒప్పుకోనందుకు అమ్మాయిని దారుణంగా పొడిచిన వ్యక్తి.. రోజుల వ్యవధిలో రెండో ఘటన

Exit mobile version