NTV Telugu Site icon

Koona Srisailam Goud: బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌

Koona Srisailam Goud

Koona Srisailam Goud

Koona Srisailam Goud: గ్రేటర్ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కూన శ్రీశైలంగౌడ్‌కు దీపాస్‌ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. గురువారం కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూన శ్రీశైలం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Read also: Congress Manifesto 2024: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు!

1992 నుంచి యూత్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో బీజేపీలో చేరి 2023లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఆశించిన కూన శ్రీశైలంకు పార్టీ మొండి చేయి చూపింది. దీంతో ఆయన గత కొద్ది రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా.. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లోనైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Girl Friend Poster: ‘గర్ల్ ఫ్రెండ్’ గా రష్మిక ఎంత క్యూట్ గా ఉందిగా..?!