Koona Srisailam Goud: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koona Srisailam Goud: గ్రేటర్ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కూన శ్రీశైలంగౌడ్‌కు దీపాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గురువారం కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూన శ్రీశైలం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Read also: Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు!
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
1992 నుంచి యూత్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో బీజేపీలో చేరి 2023లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఆశించిన కూన శ్రీశైలంకు పార్టీ మొండి చేయి చూపింది. దీంతో ఆయన గత కొద్ది రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా.. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లోనైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Girl Friend Poster: ‘గర్ల్ ఫ్రెండ్’ గా రష్మిక ఎంత క్యూట్ గా ఉందిగా..?!
తాజావార్తలు
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?