NTV Telugu Site icon

భారత్ బంద్ ఫెయిల్..! మోడీకి అండగా రైతులు..

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.. అయితే, భారత్‌ బంద్‌ ఫెయిల్‌ అయ్యిందని.. రైతులంతా ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉన్నారని తెలిపారు.. బీజేపీ ఎంపీ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఛాహార్.. విపక్షాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ ఫెయిల్ అయ్యింది.. ఎక్కడా బంద్‌ ప్రభావం కనిపించలేదన్న ఆయన.. రైతు ముసుగులో కాంగ్రెస్, విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు.. రైతులు ప్రధాని మోడీకి అండగా ఉన్నారు.. రైతు చట్టాలను వద్దనుకునే వారు… రైతు విరోధులు, దేశ వ్యతిరేకులే అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక, తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వక పోవడం దౌర్భాగ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్‌ కుమార్‌ ఛాహార్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ హామీ నెరవేర్చ లేదని ఆరోపించిన ఆయన.. ఫసల్ భీమా అమలు చేయడం లేదని మండిపడ్డారు.. రైతులకు ఈ ప్రభుత్వం మేలు చేయడం లేదంటూ విమర్శించారు.. కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ఫైర్ అయ్యారు కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఛాహార్.