Site icon NTV Telugu

బోనాల పాట.. సింగర్ మంగ్లీపై సీపీకి ఫిర్యాదు

Mangli

Mangli

తెలంగాణలో బోనాల సీజన్‌ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్‌ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని కోరారు.. ఇక, సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు బీజేపీ కార్పొరేటర్లు.

Exit mobile version