NTV Telugu Site icon

YS Jagan Government: జగన్‌కు దెబ్బకొట్టేందుకు బీజేపీ కుట్ర.. మరోసారి ఆ ప్రస్తావన తెచ్చిన కేసీఆర్

Ys Jagan

Ys Jagan

తెలంగాణ భవన్‌ వేదికగా జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కు అనుకూలంగా వైఎస్‌ జగన్‌ ఉన్నా.. అతన్ని కూడా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేసింది ఆరోపించారు కేసీఆర్.. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఈ విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించడం రెండోసారి.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్‌కు సంబంధించిన ఆడియోలు ఎప్పుడో బయటకురాగా.. ఈ మధ్యే వీడియోలు కూడా బయటపెట్టిన కేసీఆర్.. 3 గంటల పాటు ఫామ్ హౌస్ జరిగిన తతంగంపై వీడియోలు ఉన్నాయని.. అయితే ప్రేక్షకుల ప్రజల సౌకర్యార్థం వాటిని గంటకు కుదించి అందరికీ పంపిస్తున్నట్లుగా ప్రకటించారు.

Read Also: YS Jagan: రేపు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌.. సూపర్‌స్టార్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం..

దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చారని ఆపరేషన్ గుట్టు మొత్తం వీడియోలో ఉందని వ్యాఖ్యానించిన కేసీఆర్.. ఇక, ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంచలన విషయాలు బయటపెట్టిన విషయం విదితమే.. దీంతో ఏపీ రాజకీయాల్లోనూ కలకలం రేగింది. అయితే, తిరుగులేని ఎమ్మెల్యేల సంఖ్య వైఎస్‌ జగన్‌ సొంతం.. ఆయన ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయా? అనే చర్చ సాగింది.. అంతేకాదు.. ఏ ఎన్నిక వచ్చిన ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ వస్తున్న వైఎస్ జగన్‌.. కీలక బిల్లులు గట్టెక్కించడంలోనూ పార్లమెంట్ ఉభయసభల్లో ఎంతో సాయం చేశారు.. కానీ, బీజేపీ.. జగన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించడం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ రెండోసారి వ్యాఖ్యానించడం చర్చగా మారింది.