‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి ఒక్కరిని సన్నద్దం చేయడంలో భాగమే నేటి ’హర్ ఘర్ తిరంగా జెండా’ ఉద్దేశమని బండి సంజయ్ తెలిపారు.
read also:Revanth Reddy Apology : కోమటిరెడ్డి డిమాండ్‌కు దిగొచ్చిన రేవంత్… బేషరతుగా క్షమాపణ..
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తి స్పూర్తిని చాటిన బీజేపీ కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా దేశభక్తిని ప్రపంచానికి చాటి చెబుదామన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Ramesh Kumar BJP: రేపు వికారాబాద్ లో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం
