NTV Telugu Site icon

అఖిలప్రియ ఇంట్లో చోరీ..! పోలీసులపై పీఎస్‌లో ఫిర్యాదు

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. పోలీసులపై పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతో పాటు కొన్ని వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్న ఆమె… దీనిపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇది బోయిన్‌పల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ.. ఈ ఘటనపై కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు ఇచ్చారు..

తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్న భూమా అఖిలప్రియ.. బోయిన్‌పల్లి పోలీసులతో పాటు పది మంది తన ఇంట్లోకి చొరబడ్డారని.. అత్యంత విలువైన పత్రాలతో పాటు తన తండ్రికి సంబంధించిన కొన్ని వస్తువులను ఎత్తుకుపోయారని తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన కొన్ని సీసీ టీవీ ఫుటేజ్, ఫోటోలతో పాటు కొన్ని వీడియోలను కూడా ఆమె జతపరిచారు. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి పత్రాలు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ ల్యాండ్‌ వ్యవహారంలో కిడ్నాప్‌ కేసు నమోదు కావడం.. ఆ కేసులో బోయిన్‌పల్లి పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.