Bhatti Vikramarka : ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా పనిచేయాలి

  • ఓటర్ల జాబితాపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి: భట్టి
  • అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు
  • SSR ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు పూర్తి అవగాహన అవసరం
  • ధ్రువీకరణ పత్రాలు సకాలంలో సమర్పించాలని సూచన
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడంతో పాటు దానిని సంరక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘సర్’ (Special Intensive Revision) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలు, తప్పులతో కూడిన ‘అనామలస్’ (Anomalous) జాబితాలోని ఓటర్ల విషయంలో ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

అర్హుల ఓట్ల రక్షణే బాధ్యత.. సమయపాలన తప్పనిసరి

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపైనే ఉందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ఇందుకోసం సదరు ఓటర్లకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) సేకరించి, వాటిని సకాలంలో ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారుల (BLO) షెడ్యూల్‌కు అనుగుణంగా బీఎల్ఏలు కచ్చితమైన సమయపాలన పాటించాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాను దోషరహితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆదేశించారు.

×
×
Ad