Bhatti Vikramarka : ఓటు హక్కు రక్షణే ధ్యేయంగా పనిచేయాలి
- ఓటర్ల జాబితాపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి: భట్టి
- అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు
- SSR ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు పూర్తి అవగాహన అవసరం
- ధ్రువీకరణ పత్రాలు సకాలంలో సమర్పించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడంతో పాటు దానిని సంరక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘సర్’ (Special Intensive Revision) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న లోపాలు, తప్పులతో కూడిన ‘అనామలస్’ (Anomalous) జాబితాలోని ఓటర్ల విషయంలో ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అర్హుల ఓట్ల రక్షణే బాధ్యత.. సమయపాలన తప్పనిసరి
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపైనే ఉందని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ఇందుకోసం సదరు ఓటర్లకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) సేకరించి, వాటిని సకాలంలో ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారుల (BLO) షెడ్యూల్‌కు అనుగుణంగా బీఎల్ఏలు కచ్చితమైన సమయపాలన పాటించాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాను దోషరహితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!