Site icon NTV Telugu

Bhatti Vikramarka: కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka sensational comments on CM KCR: కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సీఎల్సీనేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా లో ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఅర్ అని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ ఇచ్చిన భూములను తీసుకున్నారని తెలిపారు. ధరణి పేరు మీద భూమిపై హక్కులు లేకుండా చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని తెలిపారు. ఇందారం, కోయ గూడెం ఓసీ, భూపాల పల్లి ఒసి లు ప్రైవేట్ వాళ్ళకు అప్పగించారన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నలుగురు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తున్నారని తెలిపారు. సహజవరులు కపాడుతాము ఉద్యోగాలు అన్ని స్థానికులకే ఇస్తామన్నారు. రాష్ట్ర సంస్థల్ని అమ్మకానికి పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తగుదు నమ్మా అని స్టీల్ ప్లాంట్ కి వెళ్తున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరం వల్ల పంటలు ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం మారిపోతుందని మండిపడ్డారు.

Read also: Sachin Pilot : సచిన్ పైలట్ నిరాహార దీక్ష.. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన కాంగ్రెస్ నేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.
Sachin Pilot : సచిన్ పైలట్ నిరాహార దీక్ష.. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన కాంగ్రెస్ నేత

Exit mobile version