Mallu Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 17 రోజు కు చేరుకుంది. ఉదయం 8గంటలకు బెల్లంపల్లి నియోజకవర్గం మెట్పల్లి గ్రామం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. మెట్పల్లి గ్రామం నుంచి చిత్తాపూర్, ఆవడం, గంగారం మీదుగా కాజిపల్లి నర్సింగాపూర్ గ్రామానికి పీపుల్స్ మార్చ్ చేరుకోనుంది. నెన్నెల మండలం ఆవడం గ్రామంలో లంచ్ బ్రేక్ వుంటుంది. నెన్నెల మండలం ఆవడం గ్రామంలో మధ్యాహ్నం 1గంటకు భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం కాజిపల్లి నర్సింగపూర్ గ్రామంలో రాత్రికి బస చేయనున్నారు.
Read also: Astrology : ఏప్రిల్ 1, శనివారం దినఫలాలు
కాగా.. నిన్న మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా లిక్కర్ సప్లై చేసిన కంపెనీలు ఏవీ? అంటూ ప్రశ్నించారు. ధరలను ఎవరు ఫిక్స్ చేశారు? ఏ కంపెనీలు సప్లై చేశాయి? దానికి డీలర్లు ఎవ్వరూ? అంటూ ప్రశ్నిల వర్షం కురిపించారు. డీలర్లకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకున్న సంబందం ఏమిటి? అని ప్రశ్నించారు భట్టి. లోతుగా విచారణ చేపట్టాలని కోరారు. పేపర్ లీకేజీ పై సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వెంటనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీ వ్యవహారంను ప్రభుత్వం పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ వదిలేసి మహారాష్ట్ర కర్ణాటక తిరుగుతున్నారు అంటూ ఎద్దేవ చేశారు. సీఎం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నారు? బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? అంటూ ప్రశ్నించారు. ఒక ఆయన నష్టపరిహారం, ఇంకో ఆయన పరువు నష్టమంటాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ ను అడ్డం పెట్టుకొని ఆసలు వాల్లు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
Astrology : ఏప్రిల్ 1, శనివారం దినఫలాలు