Site icon NTV Telugu

Bhatti Vikramarka: రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం

Bhatti

Bhatti

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖ‌మ్మం జిల్లా పాదయాత్ర‌లో భాగంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిప‌డ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయకుండా కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమ‌ర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి విచక్షణతో ఓటు వెయ్యాలని కోరారు.

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఇనగాలి, రాజులదేవరపాడులో శుక్ర‌వారం పీపుల్స్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాము జడవబోమన్నారు.

భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు సెక్యులర్ కూటమిగా ఏర్పడాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి, బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

YCP : హిందూపురం వైసీపీలో రచ్చ.?పంచాయితీ తాడేపల్లికి చేరిన సమస్య కొలిక్కి రాలేదా..?

Exit mobile version