NTV Telugu Site icon

Bhatti Vikramarka: తెలంగాణలో పరిపాలన గాడితప్పింది

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 32 రోజుల పాటు, 506 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరిట ఈ పాద యాత్ర ప్రారంభం అయ్యింది.మొదటి రోజు పాదయాత్ర ను ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా దేవాలయంలో పూజలు చేసి అనంతరం యాత్రను చేపట్టారు. యడవెల్లి, మాధాపురం, కట్టకూర్, మేడేపల్లి, యడవెల్లి లక్ష్మీ పురంల మీదుగా ముదిగొండకు చేరుకుంది. పాద యాత్ర సందర్బంగా గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

అన్ని గ్రామాల్లో భట్టి పాద యాత్రకు జననీరాజనం పడుతున్నారు. ఈ సందర్భంగా భట్గి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు యథేచ్ఛగా రాజ్యమేలుతున్నాయి.. నకిలీ విధానాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. నకిలీ విత్తనాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ప్రభుత్వ పాలసీలు దుర్మార్గంగా అన్యాయంగా ఉన్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాలి. అడ్డగోలు జీవోలు తీసుకుని వస్తున్నారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ సిస్టం తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ లకు 1500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవి. కానీ రీడిజైన్ పేరుతో 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్ట్ డీపీఆర్ లను బయట పెట్టాలి. కేసీఆర్ చిట్టా వుందని పదే పదే బీజేపీ నేత బండి సంజయ్ అనడమే కానీ ఎందుకు బయట పెట్టడం లేదని విక్రమార్క ప్రశ్నించారు.

ఎవరిని బ్లాక్ మెయిల్ చేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిట్టా ఉంటే, ఎందుకు బయట పెట్టడం లేదు. మీరు బయట పెట్టకుండా అపుతున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం లోని అన్ని మండలాల్లో పర్యటిస్తానని, ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతానన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కోట్ల అప్పు మిగిలింది.ఇంత డబ్బు సంపద సృష్టిస్తే సంపద ఎటు పోయింది. రాష్టంలో పరిపాలన గాడి తప్పిందన్నారు.