హాత్ సే హాత్ జోడో పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఇవాళ దళితుల సంక్షేమంపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం అంబేద్కర్ వాదాన్ని వాడుకుంటున్నారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. దళిత గిరిజన ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తున్నారని, 2014లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అంబేద్కర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చి పదేళ్ల తర్వాత ఎన్నికల కోసం విగ్రహావిష్కరణ కేసీఆర్ చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘సమాజ ఉద్ధరణకు అంబేద్కర్ ఆలోచన విధానాలను వాడాల్సిన పాలకులు ఓట్లు పొందడానికి వాడటం దుర్మార్గం. దళిత, గిరిజనుల, పేద వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు పొంది వారి జీవితాలను గాలికి వదిలేసిన కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జయంతి, వర్ధంతి ల సందర్భంగా ఏ ఒక్క సంవత్సరమైనా కెసిఆర్ పూలదండ వేశారా? టిఆర్ఎస్ పార్టీ తరపున అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారా? అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు హాజరై దళిత గిరిజనుల అభ్యున్నతికి ఏమైనా నిధులు ప్రకటించారా? అంబేద్కర్ జయంతి వర్ధంతి లకు హాజరుకాకుండా ప్రతి సంవత్సరం దళిత గిరిజనులను అవమానించిన సీఎం కేసీఆర్.
Also Read : Minister KTR : కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అధికారికంగా నిర్వహించే జయంతి వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారా? దళిత, గిరిజనులకు అత్యంత అగౌరవ పరిచిన రోజులు కేసీఆర్ పాలనలోనే. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి మళ్లించిన కేసీఆర్. దళిత గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ దయా దక్షిణ్యం అవసరంలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళిత గిరిజనులకు ఖర్చుపెడితే చాలు అభివృద్ధి చెందుతారు. కేసీఆర్ పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం. ట్రైబల్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం. ఐటిడిఎల ను విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? దళితులకు పంపిణీ చేస్తామన్న మూడు ఎకరాలను విస్మరించిన కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం పేద దళిత గిరిజనులకు భూ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన అసైన్మెంట్ కమిటీలను రద్దు చేసిన కేసీఆర్. గత ప్రభుత్వాలు పేద దళిత గిరిజనులకు అసైన్మెంట్ భూములు, మాన్యాలు పంపిణీ చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి బలవంతంగా గుంజుకుంటున్నది వాస్తవం కాదా? వెట్టి చాకిరి నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జైపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో పేదలకు ఇచ్చిన భూములను ధరణి ద్వారా వెనక్కి గుంజుకున్న హీనమైన చరిత్ర ఈ ప్రభుత్వానిది. ఫార్మాసిటీ హబ్ కోసం దళిత గిరిజనుల సంబంధించిన 7 వేల ఎకరాలను బలవంతంగా సేకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం’ అని భట్టి వ్యాఖ్యానించారు.
Also Read : Aadhaar Card : ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ?