NTV Telugu Site icon

Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!

Bhatti Kavitha

Bhatti Kavitha

Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లిక్కర్ స్కామ్.. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అతలాకుతలం చేస్తోందన్నారు. గాంధీ టోపీలు పెట్టుకుని కేజ్రివాల్.. ఆర్టీఐ లో దరఖాస్తు పెట్టి దేశాన్ని తప్పుతోవ పట్టించారన్నారు. అవినీతిని చీపురు తో ఊడ్చేస్తాం అని చెప్పిన అలాంటి కేజ్రీవాల్…లిక్కర్ స్కామ్ లో పాల్గొనడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయనంత లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ సర్కార్ చేసిందని ఆరోపించారు. అన్నా హజారే ఎక్కడ ఉన్నారు ? హజారే సేవ.. కేజ్రీవాల్ కి ధార పోసినట్టు అయ్యిందని ప్రశ్నించారు. ఢిల్లీ లో ఇలాంటి స్కామ్ జరిగింది …హజారే బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ డిమాండ్‌ చేశారు. పాలసీ క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం.. మంత్రి ఒక్కడిదే బాధ్యత కాదని గుర్తు చేశారు. సిసోడియానే కాదు.. కేజ్రీవాల్ కూడా బాద్యుడే అంటూ ఆరోపించారు. దేశానికి సమాధానం చెప్పాలని కోరారు. కవిత మీద అభియోగాలు వచ్చాయి.. సమగ్ర విచారణ కి సిద్ధం అని చెప్పాలి కానీ తెలంగాణా కు అవమానం అనడం ఏంటి ? అని ప్రశ్నించారు.

Read also: Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు

తెలంగాణకి లిక్కర్ అవినీతికి సంబంధం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా? తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. అవినీతి లో ఎంత పెద్దవాళ్ళు అయినా.. దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎవరిని వదిలి పెట్టొద్దని సూచించారు. కవితకి నోటీసులు తెలంగాణ కి అవమానం అని అంటే… సమాజం ప్రశ్నించాలని కోరారు. ప్రతి పక్షాలను వేధిస్తోంది కేంద్రం అనేది వేరే చర్చ.. అందులో నిస్సందేహం అన్నారు. కానీ లిక్కర్ స్కామ్ కి… వేదించడానికి సంబంధం లేదు అంటూ తెలిపారు భట్టి. లేని విషయాల్లో వెంటాడితే… ఖండించాలన్నారు. సోనియా.. రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చారని, వాళ్ళు మద్యం లాంటి స్కామ్ కాదని గుర్తు చేశారు. వ్యక్తిగత దోపిడీ చేశారని అభియోగాలు ఎదుర్కోలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ రక్షణ కోసం… పార్టీ బాధ్యతగా రుణం ఇచ్చింది అది తప్పు అని కేసు పెట్టారని భట్టి గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చారని, అయినా పిలవడం వేదించడమే అన్నారు. లిక్కర్ కేసుకి .. వేధింపులకు సంబంధం లేదన్నారు. కవిత లిక్కర్ స్కామ్ చేస్తే.. జనం కి ఏం సబందం అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.