Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో పదోరోజు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. నిన్న శుక్రవారం విశ్రాంతి అనంతరం నేడు భారత్ జోడో యాత్ర ఉదయం 6.30 గంటలకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు నుంచి పాదయాత్ర మొదలైంది. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్ పూర్ లో యాత్ర బృందం బస చేసింది. రోజంతా రాహుల్ గాంధీ క్యాంపులోనే గడిపారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు దానంపల్లికి చేరుకుంటారు.
Read also: China Spy Ship: భారత్‌పై నిఘా కోసం చైనా గూఢచారి నౌక .. క్షిపణి ప్రయోగానికి ముందు ఘటన
ఇక దనంపల్లిలో రాహుల్ లంచ్‌బ్రేక్ అనంతరం ఇవాళ సాయంత్రం గంటలకు నడక ప్రారంభించి రాత్రి 7గంటలకు వరకు మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని పెద్దపూర్ కు చేరుకుని.. అక్కడే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ 21కి.మీ పాదయాత్ర చేయనున్న రాహుల్. రేపు ఆదివారం నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా యాత్ర వెళుతుంది. ఆరోజు రాత్రి 7గంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో పెద్దకొడపగల్ లో ఏర్పాటు చేసిన బస వద్దకు చేరుకుంటారు. అయితే.. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర ఈ నెల 6 న రాత్రి కామారెడ్డి జిల్లాలోకి ఎంట్రీ కానుంది. ఆ రాత్రి పెద్దకొడప్గల్ వద్ద రాహుల్ బస చేస్తారు. 7వ తేదీన ఉదయం జుక్కల్ నుంచి రాష్ట్ర బార్డర్దాకా యాత్ర కొనసాగుతుంది. మధ్యలో మేనూర్ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 7వ తేదీన రాహుల్ యాత్ర తెలంగాణలో ముగిసి మహారాష్ట్రలోకి ఎంట్రీ అవుతుందని మీటింగ్ తర్వాత రేవంత్ మీడియాతో చెప్పారు. 15 రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన జోడో యాత్రలో రాహుల్ పరిశీలించిన అంశాలు సభలో వివరిస్తారు. 7వ తేది జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
Tiger Attack: బైకుపై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి.. ఆందోళనలో స్థానికుల పరుగు