NTV Telugu Site icon

KA Paul: రేవంత్‌రెడ్డి అప్పులు తెస్తున్నాడు గానీ.. అభివృద్ధి లేదు

Kapaul

Kapaul

రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరుపల్లెలో కేఏ.పాల్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సమ్మిట్ పెడతానని చెప్పి ఏడాదైనా పెట్టలేదన్నారు.

సర్పంచ్‌లకు అప్పులు ఎక్కువై.. అభివృద్ధి లేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ దుస్థితిని ప్రజాశాంతి పార్టీ ఉండనివ్వదన్నారు. మాజీ సర్పంచులు, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసి గెలవాలన్నారు. వందరోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. కుల పాలన పరంగా ఐదు శాతం రెడ్లు ఉంటే ముఖ్యమంత్రి అయ్యారని.. మూడు శాతం ఉన్నవారు ముగ్గురయ్యారు. ఒక శాతం ఉన్నవారు ఇద్దరు సీఎంలుగా అయ్యారన్నారు. బీసీలు 60 శాతం, దళితులు 16 శాతం ఉన్నారని.. ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి 90 శాతం ఉన్నా సీఎం కాలేకపోయారని తెలిపారు. ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇస్తే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

Show comments