NTV Telugu Site icon

CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.. రూ.22,500 కోట్లతో శ్రీకారం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. రూ.22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లాలి పేరుతో ఇల్లు ఇస్తామని అన్నారు. ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరుతో ఉంటే బాగుంటుందని తమ ప్రభుత్వం నమ్మిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Suryakiran : బిగ్ బ్రేకింగ్…డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత..

చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను బొంద పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని తెలిపారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ ల మధ్య గతంలో ఎన్ని కొట్లాటలు ఉన్నా.. ఇప్పుడు కలిసి అభివృద్ధిలో పాల్గొంటున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ వైపు ఉన్నారు.. కేసీఆర్ ను నమ్మలేదని ఆరోపించారు. రూ.400 ఉన్న సిలిండర్ 1200 చేసిన ఘనత మోడీ, కేసీఆర్ లేదనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భట్టి విక్రమార్క అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు.. ఆ సమయంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఉచిత కరెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వారికి ఏమి ఇవ్వం.. పేద వారికి అన్ని పథకాలు ఉంటాయి.. అడిగిన పేద వారికి ఇస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఉన్న ఊర్లో ఓట్లు వేయించుకో కేసీఆర్.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేం ఓట్లు వేయించుకుంటామని అన్నారు.

Kiran Abbavaram: బ్రేకింగ్.. ‘రహస్య’ ప్రేమికురాలితో కిరణ్ అబ్బవరం ఎంగేజ్ మెంట్

మోడీ హామీ ఇచ్చారు ఎక్కడ ఇళ్లు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, ఈటల, లక్ష్మణ్ లని అడుగుతున్నాం.. ఇళ్లు ఎక్కడ కట్టించారు అక్కడ మేం ఓట్లు అడుగమని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను బలి తీసుకుంటుందని ఆరోపించారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పటి వరకు దేశంలో ఇవ్వాలి… ఇచ్చారా ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదని సీఎం చెప్పారు. తెలంగాణలో ఖమ్మంకు ప్రత్యేక స్థానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.