NTV Telugu Site icon

Bhadrachalam: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక.. నీటిమట్టం 46.5 అడుగులు

Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam: అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పర్యాట ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 46.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 43 అడుగులు దాటి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులకి వస్తే రెండవ ప్రమాద జారీ చేస్తారు. అయితే భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఛత్తీస్గడ్ ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు నేపథ్యంలో శబరికి భారీ వరద వచ్చింది. శబరి వరద భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తుంది.. దీంతో గోదావరి వరద నీరు దిగువకి స్లోగా వెళుతుంది. గోదావరి భద్రాచల వద్ద పెరుగుతున్నది.

Read also: Bhavishyavani: తెలంగాణ అంతట పండుగ వాతావరణం.. నేడు భవిష్యవాణి కార్యక్రమం..

ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బూర్గంపాడు మండలంలో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాదం జారీ చేస్తారు. కాగా ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. ప్రస్తుతం శబరి 38 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి స్పీడ్ తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Dowleswaram Barrage: ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ఉధృతి