Site icon NTV Telugu

Bhatti Vikramarka: దేశంలో ఎక్కడా లేని పథకం రాజీవ్ యువ వికాసం స్కీమ్

Bhatti.

Bhatti.

Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు. భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతి కల్పించలేదనీ ఆరోపించారు. ఇక, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవంతో.. తెలంగాణ రాష్ట్ర యువత నిరాశా నిస్రోల్లో 10 సంవత్సరాలు గడిపిందనీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read Also: Khawaja Asif: ఇంగ్లీష్ రాకుంటే ఎందుకు మీడియా ముందుకు..? పాక్ రక్షణ మంత్రి కామెడీ మామూలుగా లేదు..

ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. నిరుద్యోగ యువత తలెత్తుకొని బతికడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చాం.. మిగిలిన ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం.. రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి మండల స్థాయిలో ప్రాసెస్ ను ప్రారంభించామని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ వరకు యువజన వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తామని వెల్లడించారు. అవగాహన లేని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, సివిల్ స్కోరుకు రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎలాంటి సంబంధం లేదని భట్టి విక్రమార్క అన్నారు.

Exit mobile version