Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..
- బెంగళూర్‌లో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్య..
- ఏఐ వల్ల ఉద్యోగం కోల్పోవడం, మతాంతర వివాహం కారణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు జంట ఆత్మహత్య కన్నీటిని తెప్పిస్తోంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సంఘటనకు కారణాలు తెలుస్తున్నాయి. ఈ విషాద ఘటనకు మానసిక ఒత్తిడి, ఆర్తిక ఇబ్బందులు, ఉద్యోగం పోవడం కారణమని తెలిసింది. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బాను చంద్రరెడ్డి(32) సోమవారం తన అపార్ట్మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఐబీఎంతో పనిచేస్తున్న ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Read Also: Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ఈ జంట ఆత్మహత్యల్లో కన్నీటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత బాను చంద్ర రెడ్డి బెంగళూర్‌లో ఉద్యోగం కోసం ఏడాదిగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోయానని, దీని వల్ల ఆదాయం లేకుండా పోయిందని ఆయన మనోవేధకు గురవుతున్నట్లు తేలింది.
చాలా కాలంగా ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడం వల్ల బానుచంద్రరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి తోడు మతాంతర వివాహం చేసుకోవడం వల్ల కుటుంబ మద్దతు లేకపోవడం కూడా మానసికంగా కుంగదీసింది. తెలంగాణలో బలమైన రాజకీయ సంబంధాలు ఉన్న అతడి తండ్రి వివాహాన్ని వ్యతిరేకించడంతో కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కుటుంబం నుంచి మద్దతు కరువై, ఉద్యోగం లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. తన ఆత్మహత్యకు తన భార్యను నిందించొద్దని రాసిన సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేని షాజియా కూడా సూసైడ్ చేసుకుంది.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!